Saturday, May 18, 2024

ఏదో ఒక‌రోజు ఎన్టీఆర్ తో న‌టిస్తా.. జేమ్స్ గ‌న్

ఏదో ఒక‌రోజు స్టార్ హీరో ఎన్టీఆర్ తో న‌టిస్తాన‌ని అన్నారు హాలీవుడ్ డైరెక్ట‌ర్ జేమ్స్ గ‌న్. ఆర్ఆర్ఆర్, గతేడాది వచ్చిన పెద్ద చిత్రం. పులులు అన్నీ బోను నుంచి బయటకు వస్తాయి. పులిలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా వ‌స్తారు..ఏదో ఒక రోజు అతడితో కలసి పనిచేయడాన్ని ఇష్టపడతా. చాలా బాగా, చాలా కూల్ గా చేశార‌ని అన్నారు.కాగా ఆర్ఆర్ఆర్ సినిమాని మెచ్చుకున్న వారిలో జేమ్స్ గ‌న్ కూడా ఒకరు. గతేడాది ఆర్ఆర్ఆర్ థియేటర్లలో స్క్రీనింగ్ సమయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లడం గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంగా పలువురు దర్శకుల దృష్టిలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పడ్డారు. జేమ్స్ గన్ తాను రూపొందించిన గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 5న థియేటర్లలోకి రానుంది. ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ నటన జేమ్స్ కు బాగా నచ్చినట్టుంది. అందుకే తాను జూనియర్ ఎన్టీఆర్ తో కలసి పనిచేయడాన్ని ఇష్టపడతానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement