Saturday, May 4, 2024

వైద్య విద్యార్థులకు తీపి కబురు.. పీజీ సీట్లను 40కు పెంచుతున్నట్లు వెల్లడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : వైద్యవిద్య ప్రవేశాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు తీపి కబురు అందించారు. వైద్య విద్యలో బీ కేటగిరి సీట్లకు లోకల్‌ రిజర్వేషన్ల ను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కేటగిరిలో సీట్ల భర్తీకీ ఇప్పటిదాకా స్థానిక రిజర్వేషన్లను అమలు చేయడం లేదు. మొత్తం సీట్లలో 50 శాతం సీట్లను ఏ కేటగిరి ద్వారా 35 శాతం సీట్లను బీ కేటగిరిలో మిగిలిన 15 శాతం సీ కేటగిరి, ఎన్నారై ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మంత్రి హరీష్‌ రావు ప్రకటనతో బీ కేటగిరి సీట్ల భర్తీలోను స్థానిక రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అధ్యాపకులు చెబుతున్నారు.

వైద్య విద్యార్థుల కోసం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన మెడ్‌ ఎక్స్‌పో కార్యక్రమంలో హరీష్‌ రావు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన అంశాలను తిలకించారు. గతంలో వైద్య విద్యకోసం ఉక్రెయిన్‌, రష్యాకు వెళ్లి చదువుకునే వారని ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు వైద్య కళాశాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని చెప్పారు. సిద్ధిపేటలో 900 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి కళాశాలలో పీజీ సీట్లను 40కు పెంచుతున్నామని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement