Thursday, May 2, 2024

రేప‌టినుంచే న్యూజిలాండ్‌ సిరీస్.. భార‌త్ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌

ముంబై: న్యూజిలాండ్‌ ఏ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్‌ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టు ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ ప్రకటించింది. సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. చెన్నయ్‌ వేదికగా జరుగనున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. సెలక్టర్లు దినేష్‌ కార్తిక్‌, రిషబ్‌ పంత్‌లను ఎంపిక చేయాలని నిర్ణయించడంతో సంజూ శాంసన్‌ భారత టీ 20 ప్రపంచకప్‌ జట్టు నుండి తప్పించబడ్డాడు. ఈ టీమ్‌లో తెలుగు క్రికెటర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌కు స్థానం దక్కింది. అదే విధంగా హైదరాబాదీ తిలక్‌ వర్మను కూడా చోటు సంపాదించుకున్నాడు. కాగా వీరిద్దరు టెస్టు జట్టుకు కూడా ఎంపికయ్యారు. ఇక యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సైతం ఈ వన్డే జట్టులో భాగంగా ఉన్నాడు.

జట్టు: సంజూ శాంసన్‌ కెప్టెన్‌, పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రాహుల్‌ త్రిపాఠీ, రజత్‌ పాటిదార్‌, కెఎస్‌ భరత్‌, వికెట్‌ కీపర్‌, కుల్దిప్‌ యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, రాహుల్‌ చహర్‌, తిలక్‌ వర్మ, కుల్దిప్‌ సేన్‌, శార్దూర్‌ ఠాకూర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నవదీప్‌ సైనీ, రాజ్‌ అంగద్‌ బవా.

కాగా మూడు టెస్టు, మూడు వన్డేల అనధికారిక సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ ఏ జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోంది.
తొలి రెండు టెస్టులు డ్రాగా ముగియగా .. మూడో టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతోంది. ఈ టెస్టు సిరీస్‌ తర్వాత సెప్టెంబర్‌ 22, 25, 27 తేదీల్లో వన్డే సిరీస్‌లో భారత ఏ జట్టు కివీస్‌ ఏ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ తమిళనాడులోని చెన్నయ్‌ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement