Thursday, May 2, 2024

Supreme Court Order – మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక పై కేసు న‌మోదుకు ఆదేశాలిచ్చిన జ‌డ్జి స‌స్పెండ్…

న్యూఢిల్లీ – తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులపై కేసులు నమోదు చేయాలని తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. రాజ్యంగబద్ద వ్యవస్థలపై కేసులు పెట్టాలని ఎలా ఆదేశిస్తారు? అంటూ ప్రశ్నిస్తు అసహనం వ్యక్తం చేస్తూ సస్పెన్షన్ ను విధించింది.

కాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు 10మంది అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ తీర్పునిచ్చారు. దీనిపై తమపైనా కేసులు నమోదుకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించటంతో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగబద్దంగా ఏర్పడ్డ వ్యవస్థలపై ఎలా కేసులకు ఆదేశిస్తారని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రాజ్యాంగ వ్యవస్థలపై కేసులు నమోదుకు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. అనంతరం జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement