Monday, April 29, 2024

Sun Burn ఈవెంట్ కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌…

హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో ‘సన్‌బర్న్‌’ పేరిట నిర్వహించ తలపెట్టిన ఈవెంట్‌పై దుమారం రేగడంతో సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి స్పందించారు. ఈవెంట్‌ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ సమీపంలో ఈ ఈవెంట్‌ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్‌బర్న్‌లాంటి వేడుక కాదని, అందుకే అనుమతి నిరాకరించామని మహంతి వెల్లడించారు.

మరోవైపు ఈవెంట్‌కు సైబరాబాద్‌ పోలీసులు అనుమతి ఇవ్వకున్నా ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఈవెంట్‌కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించడం, ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. ఆ వెంటనే సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్‌ నిర్వాహకుల్ని, బుక్‌ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకొని గట్టిగా మందలించారు. ఇప్ప‌టికే టికెట్స్ కొన్న‌వారికి డ‌బ్బువాప‌స్ చేయాల‌ని కోరారు.. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement