Sunday, May 5, 2024

Health: విజయవంతంగా అరుదైన శస్త్ర చికిత్స.. పూడుకుపోయిన యోని ముఖద్వారం పునర్‌నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పది వేల మందిలో ఒకరిలోనే తలెత్తే ఈ అరుదైన సమస్యని డాక్ట‌ర్ల బృందం విజ‌య‌వంతంగా స‌రిచేసింది. యోని ముఖద్వారం పూడుకుపోవడంతో తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న 15 ఏళ్ల బాలికకు శస్త్ర చికిత్స ద్వారా రెనోవా -లంగర్‌హౌజ్‌ ఆసుపత్రి డాక్ట‌ర్లు నయం చేశారు. ఆసుపత్రికి చెందిన డాక్ట‌ర్‌ పద్మావతి కపిల, డాక్ట‌ర్‌ వెంకటరెడ్డి బృందం యువతికి అవసరమైన పరీక్షలు నిర్వహించి… శస్త్ర చికిత్సతో ఆమెకు సాధారణ జీవితాన్ని ప్రసాదించారు. యోని ముఖద్వారం మూసుకుపోవడంతో కలుషితమైన ద్రవపదర్థాలు పేరుకుపోయి ఆ బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడిందని చెప్పారు.

వైద్య పరీక్షల్లో బాలిక అంతర్గత పునరుత్పత్తి అవయవాలు సరిగానే ఉన్నాయని గుర్తించామని, శస్త్ర చికిత్స ద్వారానే యోని ముఖద్వారాన్ని సరిచేయాలని నిర్ణయించామన్నారు. శస్త్ర చికిత్స అనంతరం మూడు రోజుల్లోనే బాలిక కోలుకుని డిశ్చార్జి అయ్యింద‌ని చెప్పారు. భవిష్యత్‌లో లైంగికపరమైన, సంతాన పరమైన సమస్యలేవి ఆ బాలికకు ఎదురుకావన్నారు. ప్రస్తుతం చాలా మంది మహిళలు ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నారని, అయితే సకాలంలో వైద్యులను సంప్రదిస్తే మెరుగైన వైద్యం ద్వారా తీవ్ర దుష్పరిణామాలు రాకుండా చికిత్స అందించేందుకు వీలుంటుందని డాక్ట‌ర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement