Monday, April 29, 2024

బర్మింగ్​హామ్​లో కామన్​వెల్త్ క్రీడలు.. అర్హత పొందిన మ‌హిళా రెజర్లు వీరే..

వచ్చే జులై 25 నుంచి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఈ ఏడాది జరిగే ప్రపంచ స్థాయి కామన్‌వెల్త్ పోటీలకు భారత్ నుంచి పలువురు మహిళా రెజ్లర్లు ఎంపికయ్యారు. కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు భారత క్రీడాకారులు ఉత్సాహం చూపిస్తున్నారు . 2010 నుంచి ఇప్పటి వరకు ఈ క్రీడల్లో 200 మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈసారి కూడా కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ నుంచి అధికసంఖ్యలో క్రీడాకారులు పాల్గొని సత్తా చాటతారని అందరూ అనుకుంటున్నారు.

కాగా, 50 కేజీల విభాగంలో పూజా గెహ్లాట్, 53 కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ అర్హత పొందగా.. 57 కేజీల విభాగంలో అన్షు మాలిక్, 62 కేజీల విభాగంలో సాక్షి మాలిక్, 68 కేజీల విభాగంలో దివ్యా కక్రాన్ పోటీ పడనున్నారు. వీరితోపాటు 76 కేజీల విభాగంలో పూజా దండ కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. జులై 25 మొద‌లైన‌ కామన్‌వెల్త్ క్రీడలు ఆగస్టు 8 వరకు జరుగుతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement