Thursday, May 9, 2024

మానసిక ఉల్లాసానికి క్రీడలు – లింగాల క‌మ‌ల్ రాజు

మధిర (ఖమ్మం జిల్లా) క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, మధిర లైన్స్ క్లబ్ చైర్మన్ మల్లాది వాసు పేర్కొన్నారు. మధిర క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరావు, టిఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement