Thursday, December 5, 2024

కుక్కల విషయంలో ప్రత్యేక టీమ్ లు.. మంత్రి తలసాని

కుక్కల విషయంలో ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ లో స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు. స్టెరిలైజేషన్ ప్రక్రియలో స్థానికులు సహకరించాలన్నారు. మాంసం దుకాణాల వద్ద కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయన్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయన్నారు. టోల్ ఫ్రీ నెంబర్, ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో హెల్ప్ లైన్ నెంబర్ 040- 21111111 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కొత్త టెక్నాలజీని వాడుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement