Sunday, December 8, 2024

Speaker – సభాపతిగా ప్రసాద్ కుమార్ ఎన్నికపై రేవంత్ ప్రశంసల జల్లు..

హైద‌రాబాద్ – శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసన సభలో సభ్యలందరి హక్కులను కాపాడగలరనే పూర్తి విశ్వాసం ఉందని, . ఒక మంచి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన సభ్యలందరికీ ధన్యవాదాలు తెలపుతున్నానని, ఈ సంప్రదాయం మున్ముందు ఇలాగే కొనసాగాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వికారాబాద్ శాసన సభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ను శాసన సభాపతిగా గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ గడ్డం ప్రసాద్ కుమార్ను సభాపతిగా ఆమోదించాయి. దీంతో ఆయ‌న నేడు స్పీక‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.. దీంతో అధికార‌, విప‌క్ష నేతలు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సభాపతికి సీఎం అభినందనలు తెలుపుతూ, వికారాబాద్ మంచి వైద్యం అందించేందుకు అనువైన ప్రాంతమని, అలాంటి ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఎన్నికవ్వటంతో సమాజంలోని ఎన్నో రుగ్మతలను పారద్రోలవచ్చని తాను ఆకాంక్షిస్తున్నానని, గడ్డం ప్రసాద్కు ఉమ్మడి కుటుంబ బాధ్యతలు బాగా తెలుసని, సభ్యులందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్థవంతంగా నిర్వహించగలరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గడ్డం ప్రసాద్ కృషి ఫలితంగానే వికారాబాద్ కు మెడికల్ కాలేజీ వచ్చిందని, అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నెగూడా చౌరస్తా వరకు రోడ్డు విస్తరణకు ఆయన చొరవ చూపారని, ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఎదిగిన ఆయన కృషి ఎంతో అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement