Sunday, April 28, 2024

ఘనంగా రాజధాని రెసిడెన్షియల్ స్కూల్ ఆవిర్భావ దినోత్సవం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని రాజధాని రెసిడెన్షియల్ స్కూల్ 33వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకన్న గారి కమలాకర్ రావు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వెంకన్న గారి కమలాకర్ మాట్లాడుతూ… ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివేందుకు విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. రాజధాని స్కూల్లో కేవలం చదువుపైనే కాకుండా సామాజిక స్పృహను పెంపొందించేందుకు కృషిచేయడం అభినందనీయమన్నారు.

రాజధాని రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థాపకులు, చైర్మన్ మక్కపాటి చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ… 33 సంవత్సరాల క్రితం రాజధాని రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించి సీబీఎస్సి సిలబస్ తో విద్యాబోధన చేస్తున్నామన్నారు. సనాతన ధర్మంలో మన సంస్కృతి, సాంప్రదాయాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పిల్లలకు చదువుతో పాటు వివిధ పోటీ పరీక్షలకు సైతం సిద్ధం చేయడం అధ్యాపక వర్గం కృషి చేస్తున్నారని అన్నారు. స్పోర్ట్స్,నాటక రంగం, చిత్రకళా, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను తీర్చిదిద్దదమే తమ స్కూల్ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. రాజధాని రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజ్మా ఫీరోజ్ మాట్లాడుతూ…. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల చదువు విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని అధ్యాపక వర్గాలకు సహకరిస్తే విద్యార్థులు భావిభారత పౌరులు తయారు కావడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రాంప్ట్ అధ్యక్షుడు భాను ప్రకాష్, బీజేపీ మైనార్టీ సెల్ నాయకులు షేఖ్ షాజహాన్, ప్రముఖ సంఘ సేవకులు కొలన్ కృష్ణారెడ్డి, డాక్టర్ వనజ, డాక్టర్ రవితేజ రాయుడు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement