Thursday, March 28, 2024

విశాఖలో కరోనా అలజడి.. పాజిటివ్ వచ్చిన వారిని ఐసొలేషన్ కు తరలింపు..

విశాఖపట్నం, ప్రభన్యూస్ : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను ఒమిక్రాన్‌ గజగజలాడిస్తుంది. దీంతో పలు దేశాలు ముందస్తుగా అప్రమత్తం కూడా అయ్యాయి. అయితే విశాఖలోనూ అలజడి చెలరేగింది. తాజాగా ఇక్కడ ఆంధ్రాయూనివర్సిటీ వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఇండియా స్కిల్‌ కాంపిటేషన్స్‌లో భాగంగా అనేక రాష్ట్రాల నుంచి సుమారు 800 మంది విద్యార్ధులు హాజరయ్యారు. అయితే వీరిలో పలు రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చిన నలుగురు విద్యార్ధులకు కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అయితే వీరితో పాటు సన్నిహితంగా మెలిగిన మరో 25 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. అయినప్పటికి వీరిని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఐసోలేషన్‌లో ఉంచారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విద్యార్ధులకు సంబంధించింది ఒమైక్రాన్‌ కాదని అధికారులు నిర్ధారించారు.

అయినప్పటికి ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉన్న 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఆదేసాలు జారీ చేశాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్సవానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంగ్‌ కాంగ్‌, ఇజ్రాయిల్‌ వంటి దేశాల నుంచి వచ్చిన ప్రయాణీకులకు ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలు నిర్వహించి అవసరమైతే ఐసోలేషన్‌ కేంద్రాలకు పంపుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా విశాఖ విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌లలో ప్రత్యేక స్క్రీనింగ్‌ఒ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా కోవిడ్‌ వైరస్‌ కొత్త వేరియంట్‌కు సంబంధించి విశాఖ జిల్లా ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ తిరుపతిరావు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారెవరైనా కోవిడ్‌ లక్షణాలుతో బాదపడితే తక్షణమే వైద్యఆరోగ్యశాఖ దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement