Sunday, April 28, 2024

Siddipet – హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

సిద్దిపేట : తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసారు. సిద్దిపేట నుండి మరోసారి బరిలోకి దిగిన హరీష్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామునే కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఆయన వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నిబంధనలను అనుసరించే పోలీసులు మంత్రి హరీష్ వాహనాన్ని ఆపి తనిఖీ చేసారు.

హరీష్ రావుతో పాటు ఆయన అనుచరులు, బిఆర్ఎస్ నేతలు పోలీసులకు పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. ఎన్నికల విదుల్లో భాగంగానే వాహనాల తనిఖీ చేపట్టినట్లు… ఈ క్రమంలోనే మంత్రి కాన్వాయ్ ని కూడా ఆపినట్లు పోలీసులు తెలిపారు. తమకు సహకరించినందుకు మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement