Monday, April 29, 2024

TS: ఆల‌య నిర్మాణాల‌కు సహకరించాలి – బండి సంజ‌య్

సిరిసిల్ల, ఫిబ్రవరి 12 (ప్రభ న్యూస్) : దేవాలయాల నిర్మాణాలకు హిందూ బంధువులందరూ సహకరించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ పిలుపునిచ్చారు. సోమవారం సిరిసిల్లలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాహిత యాత్ర సోమవారం ప్రారంభానికి ముందే ఉదయం పూట సిరిసిల్లలోని మార్కండేయ దేవస్థానానికి వచ్చి జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజలు ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు బ్రతకాలని, ప్రశాంత జీవితం గడపాలని, కష్టాలు తొలగిపోయి సంస్కారవంతమైన జీవితం గడిపేవిధంగా స్వామి ఆశీర్వాదం అందజేయాలని మార్కండేయ స్వామిని వేడుకున్నట్టు బండి సంజయ్ తెలిపారు.. 500 సంవత్సరాల నుంచి ఎదురుచూసిన అయోధ్య బాల రాముడి ఆలయ నిర్మాణంలో దేశవ్యాప్తంగా హిందువులందరూ భాగస్వాములయ్యారని, అలాగే సిరిసిల్ల మార్కండేయ దేవస్థానం నిర్మాణంలో కూడా అందరూ కలిసి మెలిసి సమైక్యంగా భాగస్వాములు కావాలని కోరారు.

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు ప్రతిసారి బ్రాహ్మణంగా జరుగుతాయని, ఈసారి కొత్తగా ఆలయ నిర్మాణం చేపట్టినప్పటికీ ఆ స్థాయిలోనే ఉత్సవాలు జరుపుతున్నారన్నారు. దేవస్థానాల నిర్మాణంలో హిందువులందరూ సహకరించి భాగస్వాములు కావాలన్నారు. 500 సంవత్సరాల నుంచి ఎదురుచూసిన అయోధ్య బాల రాముడి ఆలయ నిర్మాణంలో దేశవ్యాప్తంగా హిందువులందరూ భాగస్వాములయ్యారని, అలాగే సిరిసిల్ల మార్కండేయ దేవస్థానం నిర్మాణంలో కూడా అందరూ కలిసి మెలిసి సమైక్యంగా భాగస్వాములు కావాలని కోరారు. సిరిసిల్లలో మార్కండేయ దేవస్థానం శక్తివంతమైన దేవాలయంగా రూపుదిద్దుకోబోతుందని, చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ కూడా మార్కండేయ స్వామి శక్తి వ్యాప్తం కానున్నదన్నారు.

- Advertisement -

పార్లమెంటు సభ్యుడిగా, హిందువుగా సిరిసిల్ల మార్కండేయ దేవస్థానంకు సహకారం అందిస్తానన్నారు. మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ కార్యదర్శి మండల సత్య, ఉపాధ్యక్షులు డాక్టర్ గాజుల బాలయ్య, పద్మశాలి సంఘం పాలకవర్గంతో పాటు బిజెపి నాయకులు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడెపు రవీందర్, బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ గూడూరు భాస్కర్, పట్టణ కార్యదర్శి నాగుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డబోయిన గోపి, కోడం ఆనందబాబు, మోర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement