Sunday, February 18, 2024

అన్నమయ్య కీర్తనలు : ఈపెకు ఇతడు తగు

రాగం : కళ్యాణి

ఈపెకు ఇతడు తగు ఇతనికి ఈపెతగు
చూపులకు పండుగాయ శోభనము నేడు ||ఈపెకు ఇతడు తగు||

పిలువరె పెండ్లికూతురు పెండ్లిపీట మీదికి
చెలగీ తానెదురు చూచీ దేవుడు
బలువుగా యిద్దరికి బాసికములు కట్టరే
కలిమెల్ల మెరసీ సింగారించరే ||ఈపెకు ఇతడు తగు||

ఆతల తెచ్చి పెట్టరే ఆ పెండ్లి కూతురును
ఆతడె జంట శోభన మిద్దరికిని
కాతరాన బువ్వానకు గక్కన వెట్టరె మీరు
రేతిరి నుండియు వేగించరే మీరు ||ఈపెకు ఇతడు తగు||

పానుపులు పరచరే బలునాగవల్లి నేడు
పూనితెర వేయరే పొలతులాల
ఆనుక శ్రీవేంకటేశుడలమేలు మంగయును
లోననే భూకాంతయును లోలులైరి తాము ||ఈపెకు ఇతడు తగు||

Advertisement

తాజా వార్తలు

Advertisement