Friday, April 26, 2024

బండి సంజయ్‌ అరెస్టును ఖండించిన‌ శివరాజ్ సింగ్ చౌహాన్

ఇటీవల బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌కుమార్‌ను అరెస్టు చేయడాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఖండించారు. నిరసన ప్రదర్శన కోసం కోవిడ్-19 నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు అతన్ని అరెస్టు చేశారు. బండి సంజయ్ కుమార్‌ను విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించడంతో బుధవారం ఆయన విడుదలయ్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పర్యటనలో, చౌహాన్ కుమార్‌కు జరిగిన అన్యాయాన్ని నిరసించారు. రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడినందుకు బండి సంజయ్ కుమార్‌ని జైలులో పెట్టారని చౌహాన్ అన్నారు. కేసీఆర్‌ ఇళ్లు, ఉచిత విద్య వంటి ఎన్నో హామీలు ఇచ్చారని.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఇక ఇప్పుడు సంజయ్ కుమార్ సమాధానాలు అడగడంతో బెదిరించి జైల్లో పెట్టారన్నారు. అయితే తెలంగాణలో ఏదో ఒకరోజు కమలం వికసిస్తుంది.. కాబట్టి మేం ఎవరికీ భయపడమ‌న్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీ సమర్ధవంతమైన నాయకత్వంలో అద్భుతమైన, శక్తివంతమైన, సుసంపన్నమైన భారతదేశం నిర్మించబడుతోంది. అలాగే కూపై కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement