Thursday, May 9, 2024

ప్ర‌భుత్వ ఉద్యోగాలకు క్యాలెండర్‌తో షెడ్యూల..

హైదరాబాద్‌, (ప్ర‌భ‌న్యూస్): ఉద్యోగ నియామకాలకు ఇకపై క్రమం తప్పకుండా క్యాలెండర్‌ దిశగా ప్రభుత్వం సిద్దమవుతోంది. రానున్న ఆరు నెలల్లోగా 50వేల నియామకాలను పూర్తి చేసేలా ప్ర‌భుత్వ‌ నిర్న‌యం. గతంలో ఉద్యోగ నియామకాలకు రాష్ట్రంలో ఎటువంటి కాలపరిమితి లేదు. దీంతో అనేక ఖాళీలు ఎక్కువ కాలం కనిపిస్తూ పాలనలో జాప్యం తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలకు టైం షెడ్యూల్‌ దిశగా సర్కార్‌ కృషి చేస్తోంది. ఖాళీలు ఏర్పడ్డ ఆరు నెలల్లోగా నియామకాలు పూర్తయ్యేలా నిర్ధిష్ట కార్యాచరణ చేస్తోంది. ఈ మేరకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో టీఎస్‌పీఎస్సీ సహా ఇతర నియామక సంస్థలు, బోర్డులకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది.

ఆ తర్వాత నెలవారీ క్యాలెండర్‌ను రూపొందించి ఎప్పటికప్పుడే ఖాళీలను భర్తీ చేసేలా ఉద్యోగ క్యాలెండర్‌ను రూపొందిస్తోంది. ఇకపై రాష్ట్రంలో ఇదే విధానాన్ని తీసుకొచ్చి నియామకాలను ఏనెలాకానెల పూర్తి చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే, బ్యాంకులు, ఇతర సంస్థలకు ఒకే పరీక్ష విధానాన్ని అమలు చేస్తున్న తీరును పరిశీలిస్తున్నారు. ఒకే పోటీ పరిక్షతో ఆయా సంస్థల పరిధిలోని ఉద్యోగులకు అభ్యర్ధులను గుర్తించి అర్హత వారీగా తీసుకుంటారు. మొదట ఈ విధానం ఇంజనీరింగ్‌ విభాగంలో వర్తింపజేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్‌ మరోసారి నియామకాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
నూతన జోనల్‌ విధానానికి అవసరమైన అన్ని ఆమోదాలు లభించిన నేపథ్యంలో నియామక నోటిఫికేషన్లకు అడ్డంకులు తొలగిపోయాయి.

ఈ తరుణంలో వాస్తవంగా ఉన్న ఖాళీలు, అవసరమయ్యే పోస్టుల భర్తీ, పదోన్నతులతో ఏర్పడిన ఖాళీల వంటి వివరాలను ప్రభుత్వం సేకరిస్తున్నది. కాగా పీఆర్సీ కమిషన్‌ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలున్నా యని ప్రభుత్వం గుర్తించింది. కానీ వాస్తవానికి 1,02,217 పోస్టులకు ప్రభుత్వం వద్ద వివరాలు ఉన్నాయని , వాటిని వివిధ నియామక సంస్థలతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.ఇందులో 87,346 పోస్టులకు నియామక నోటిఫికేషన్లు జారీ చేసి పురోగతిలో ఉన్నాయని, 33 వేల పోస్టులు భర్తీ చేసినట్లు సీఎస్‌కు చేరిన నివేదికలో వెల్లడైందని తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement