Wednesday, May 1, 2024

మాట నిలబెట్టుకునే మగతనం లేదా?: సీఎం కేసీఆర్‌పై షర్మిల హాట్ కామెంట్

తెలంగాణలో రైతుల పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని గతంలో చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు కేంద్రంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో 21వ రోజు మంగళవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లిలో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహించారు. అనంతరం సభలో మాట్లాడుతూ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం పెత్తనం ఏమిటి? ఆఖరి గింజ వరకూ నేనే కొంటా’అని చెప్పిన కేసీఆర్‌కు మాట మీద నిలబడే మగతనం లేదా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంట చేతికొచ్చాక నేను కొనను అంటే రైతులు ఏమైపోవాలని, మీరు మాటమీద నిలబడే మొగనాళ్లు కాదా? అని ప్రశ్నించారు. వరి వద్దని చెప్పడానికేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది? అని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని కేసీఆర్.. తాగుబోతుల కోసం మద్యం నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. మహిళలపై రోజురోజుకీ దాడులు పెరుగుతున్నా.. కొత్తగా 400కి పైగా మద్యం షాపులు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. మద్యం నియంత్రిచడం చేతగాక.. వ్యవసాయాన్ని నియంత్రిస్తున్నారని షర్మిల విమర్శించారు.

https://twitter.com/YSSR2023/status/1458044814604136454
Advertisement

తాజా వార్తలు

Advertisement