Sunday, April 28, 2024

Exclusive | మెడ్చల్ డీసీపీగా శభరీష్.. ప్రజా పోలీస్​ ఆఫీసర్​గా పేరు

సైబరాబాద్ కమిషనరేట్ పరిదిలో మెడ్చల్ ఏరియా డీసీపీగా సీనియర్​ ఐపీఎస్​ ఆఫీసర్​ శభష్​ను ఇవ్వాల (బుధవారం) ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇక.. 2017 ఐపీఎస్​ బ్యాచ్ కి చెందిన శభరీష్ గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూర్ ఏఎస్పీగా పనిచేశారు. అంతేకాకుండా ఖమ్మం డీసీపీ అడ్మీన్ గా కూడా ఉన్నారు.

ప్రస్తుతం ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ డీసీపీగా పనిచేస్తుండగా మేడ్చల్​ ఏరియా డీసీపీగా బదిలీ అయ్యారు. తాను పనిచేసిన ప్రతి చోటా ప్రజా పోలీస్​ ఆఫీసర్​గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక.. ఆయన సతీమణి, ఐఏఎస్​ ఆఫీసర్​ స్నేహలత ప్రస్తుతం జీహెచ్​ఎంసీ అడిషనల్ కమిషనర్​గా ఈ మధ్యనే నియామకం అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement