Friday, December 6, 2024

రూ.1.40 కోట్ల నెట్ క్యాష్ తో క్యాషియ‌ర్ జంప్….

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రామ్‌గోపాల్‌ పేట ఠాణా పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ పాల ఉత్పత్తి కేంద్రం కార్యాలయంలో క్యాషియర్‌గా పనిచేస్తున్న వ్యక్తి రూ.1.40 కోట్ల చోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు రామ్‌గోపాల్‌ పేట పోలీసులకు యజమాని రాజేష్ గాంధీ ఫిర్యాదు చేశారు. గత 4 రోజులుగా కార్యాలయానికి కన్వర్ రాజ్ రాకపోవడంతో అనుమానం వచ్చిన రాజేష్.. కార్యాలయానికి వచ్చి చూడగా రూ.1.40 కోట్ల నగదు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కన్వర్ రాజుపై ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పలు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement