Monday, May 6, 2024

గూడ్సు రైళ్ల ద్వారా ఎఫ్‌సీఐకి బియ్యం.. గజ్వేల్‌, మెదక్‌ ప్రాంతాలకు ఎరువుల పంపిణీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి, మనో#హరాబాద్‌, మెదక్‌ రైల్వే లైన్లను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) గోదాములతో అనుసంధానించనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ అంశంపై సంబంధిత అధికారులతో మంగళవారం ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వ#హంచారు. గజ్వేల్‌లోని గోదాములను కొత్త రైల్వే లైన్లతో త్వరగా అనుసంధానించాలని ఆదేశించారు. ధాన్యాన్ని, ఎరువులను ఈ లైన్ల ద్వారా రవాణా చేస్తే స్థానిక రైతులకు, పౌర సరఫరాల వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

సనత్‌నగర్‌, చర్లపల్లి నుంచి కాకుండా కొత్త లైన్ల ద్వారా ధాన్యం, ఎరువుల రవాణాను చేపట్టాలని సూచించారు. దాంతో కాలయాపన, ఆర్థికవ్యయం గణనీయంగా తగ్గుతుందన్నారు. మంత్రి సూచనలను పరిగణనలోకి తీసుకుని త్వరలో ఆ దిశగా నిర్ణయం తీసుకుంటామని ఎఫ్‌సీఐ జనరల్‌ మేనేజర్‌ సానుకూలంగా స్పందించారు. గూడ్స్‌ రైల్వే సర్వీసుల ద్వారా గజ్వేల్‌, మెదక్‌కు ఎరువులను రవాణా చేయాలని మార్క్ఫెడ్‌ అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో మెదక్‌ కలెక్టర్‌, సిద్దిపేట అదనపు కలెక్టర్‌, ఎఫ్‌సీఐ జనరల్‌ మేనేజర్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌, డివిజల్‌ రైల్వే మేనేజర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement