Monday, April 29, 2024

జూన్ 3న టీఎస్‌ సీపీగెట్‌ నోటిఫికేషన్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ కామన్‌ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీపీగెట్‌)-2022 నోటిఫికేషన్‌ను జూన్‌ 3వ తేదీన తెెలంగాణ ఉన్నత విద్యామండలి వెలువరించనుంది. ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement