Sunday, May 5, 2024

Revanth Reddy: మోడీని మూడో సారి ప్రధాని చేయడానికి కేసీఆర్ డ్రామా

జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. మోడీని మూడో సారి ప్రధాని చేయడానికి కేసీఆర్ ఆడుతున్న డ్రామాగా ఆయన అభివర్ణయించారు. మోడీని మూడో సారి ప్రధానిని చేస్తే కేసీఆర్ జైలుకు వెళ్లకుండా ఉంటాడని అన్నారు. కేంద్ర సర్కార్.. బిజెపి సీఎంలకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కానీ కేసీఆర్ అవినీతిపై ఏనాడూ మాట్లాడలేదన్నారు. కేసీఆర్ ను కాపాడడానికే ఈఎస్ఐ, సహారా కుంభకోణం కూడా కేంద్రం తొక్కి పెట్టిందని ఆరోపించారు. కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే యూపీ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రచారాలు చేయాలని సవాల్ విసిరారు.  ఒడిశాలోని నైని కోల్‌మైన్‌ను అదానీకి కట్టబెట్టనున్నారని ఆయన మండిపడ్డారు. నైని కోల్ కుంభకోణాన్ని ఆపడానికి న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తాం అని చెప్పారు. యూపీఏను చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఎవరిని బలహీన పర్చేందుకు ప్రయత్నిస్తున్నారు? మోదీనా, యూపీఏనా? అని రేవంత్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement