Tuesday, May 14, 2024

Resigned – కాంగ్రెస్ గూటికి చేరిన బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ – లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రభుత్వాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీని కీలక నేతలు ఒక్కొక్కరిగా వీడుతున్నారు.తాజాగా బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది

ఈ క్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు

అనంతరం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డితో కలిసి గాంధీభవన్‌కు వచ్చిన ఆయన కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో పార్టీలో చేరారు. ఇంద్రకరణ్‌రెడ్డికి పార్టీ కండువా కప్పిన దీపాదాస్‌ మున్షీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు

.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement