Monday, May 6, 2024

Inter Results : తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల చేశారు. ఒకేసారి ఇంట‌ర్ ఫ‌స్ట్, సెకండ్ ఇయ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాయలంలో విద్యాశాఖ చీఫ్ సెక్రటరీ శృతి ఓజా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫ‌స్ట్ ఇయ‌ర్ లో 60శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. సెకండ్ ఇయ‌ర్ లో 64శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 60.01 శాతం మంది పాస్ అయ్యారని తెలిపారు. సెకండ్ ఇయర్ లో 64.16 శాతం మంది పాస్ అయ్యారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్ లో నిలిచాయని తెలిపారు. సెకండ్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ లో ములుగు జిల్లా టాప్ ప్లేస్ లో నిలిచింది.

ఫస్ట్ ఇయర్ ఎంపీసీ మొత్తం పరీక్ష రాసిన వారి సంఖ్య 2 లక్షల 19 వేల 782 …. పాస్ అయినవారి సంఖ్య1లక్షా 50 వేల 597. 68 శాతం మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ మొత్తం పరీక్ష రాసిన వారి సంఖ్య 2 లక్షల 17 వేల 839… పాస్ అయినవారి సంఖ్య 1లక్షా 60 వేలు. 73.8 శాతం మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ బైపీసీ మొత్తం పరీక్ష రాసిన వారి సంఖ్య 93 వేల 363… పాస్ అయినవారి సంఖ్య 62 వేల 875. 67.34 శాతం మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ బైపీసీ మొత్తం పరీక్ష రాసిన వారి సంఖ్య 1 లక్షా14 వేల 180…..పాస్ అయినవారి సంఖ్య 70 వేల 338… 37.52 శాతం మంది పాస్ అయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement