Tuesday, April 30, 2024

TS: నిర్ల‌క్ష్య డ్రైవింగ్… 13వేల మంది లైసెన్సుల ర‌ద్దు..

హైద‌రాబాద్ – తెలంగాణలో ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపేవాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే రోడ్లపై నిబంధనలు ఉల్లంఘించే వారిపై రవాణాశాఖ ఉక్కుపాదం మోపుతున్న‌ది.. ప్రమాదాలకు కారణమయ్యే వారిపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా గతేడాది ప్రమాదాలకు కారకులైన 13 వేల మంది వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు చేసింది. అందులో అత్యధికంగా డ్రంకెన్‌ డ్రైవ్ కేసులే ఉన్నాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు. రద్దు చేసిన లైసెన్స్‌లను తిరిగి ఆర్నెళ్ల వరకు పునరుద్ధరించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈనెల 22వరకు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన వాహనదారులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 765 లైసెన్స్‌లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. వాటిలో అత్యధికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 7,564, ప్రమాదాలకు కారణమైన వారివి 783 వరకు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున ప్రతి నెలకు సుమారు 1,147 లైసెన్స్‌లను రవాణాశాఖ సస్పెండ్ చేస్తోంది. ఇందులో 70 శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయని అధికారులు చెప్పారు. నిబంధనల ప్రకారమే వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement