Wednesday, November 30, 2022

50 అడుగుల సీఎం కేసీఆర్ ముఖ చిత్రంను తిలకించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130వ‌ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ గణేష్ గ్రౌండ్స్ వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను తీరొక్క రంగులతో మహిళలు వేసిన ముగ్గులు, సీఎం కేసీఆర్ 50 అడుగుల చిత్ర ముఖంను ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని, స్థానిక కార్పొరేటర్ హేమలత సురేష్ రెడ్డి తో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ చిత్ర ముఖంను వేసిన జాన్ వెస్లీని, అదే విధంగా సంక్షేమ పథకాల ముగ్గులు వేసిన సరితను అభినందించారు.

- Advertisement -
   

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతులకు చేయని మేలును తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని చెప్పారు. నాలుగేండ్లలో రూ.50 వేల కోట్లు రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలువనుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ రంగారావు, ప్రధాన కార్యదర్శి శివాజీ, ఏరియా కమిటీ మెంబర్ అడప శేషు, పద్మలతా రెడ్డి, పద్మజ రెడ్డి, అడప శేఖర్, నాయకులు చందు, నాని, భద్రయ్య, నాగిరెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్, ఇస్మాయిల్, చంటి, నర్సింగ్ రావు, శ్రీనివాస్ రాజు, దుర్గా రావు, బస్వరాజు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement