Monday, May 13, 2024

మన ఊరు-మన బడిలో NRI లు భాగస్వాములు కావాలి : ఎంపీ రంజిత్ రెడ్డి

మ‌న ఊరు-మ‌న బ‌డిలో NRI లు భాగస్వాములు కావాలని చేవెళ్ల‌ ఎంపీ డా. జి.రంజిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాగృతి NRI-UK టీం’ ఆధ్వర్యంలో@ మీట్ & గ్రీట్ విత్ చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి”అనే కార్యక్రమాన్ని లండన్ లో నిర్వహించి, స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి -పథకాల అమలు తీరు పై యువ NRIలతో ముచ్చటించారు. యునైటెడ్ కింగ్ డమ్ (UK)లో నివసిస్తున్న తెలంగాణకు చెందిన NRI లు తమ స్వగ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి ముందుకు రావాలని వారిని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఉత్తమ వ్యాపారవాతావరణాన్ని అందిస్తున్నదని ఇటీవల నీతి ఆయోగ్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమ ప్రాధాన్యతను, ఏడేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతితో పాటు ఇటీవల వివిధ పారిశ్రామిక వేత్తలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన తన అనుభవాలను వారితో పంచుకున్నారు. అలాగే చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో తన ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, యువతకు ఉపాధి అవకాశాలపై చేస్తున్న సేవా కార్యక్రమాలను వారికి వివరించారు. ఇందుకు స్పందించిన పలువురు NRI లు తమ వంతు సహాయం అందిస్తామని చెప్పడమే కాకుండా తెలంగాణలో కొన్ని ప్రభుత్వ స్కూల్స్ ని దత్తత తీసుకుంటామని ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యూకే టీం ప్రతినిధులు సుమన్ రావు, రఘు జక్కుల, వంశీ,కిషోర్, మానస టేకుమట్ల లతో పాటు పలువురు NRI లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement