Friday, May 10, 2024

RR: 108 అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే యాదయ్య

మొయినాబాద్ మండల కేంద్రంలో 108 అత్యవసర అంబులెన్స్ సేవలను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజారోగ్యానికి ప్రాధాన్యత, తక్షణ వైద్య సేవలకు 108 అంబులెన్స్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పేద ప్రజల ఆరోగ్య సేవలకు అత్యవసర వాహన సేవలు అవసరమన్నారు. ప్రజలందరూ 108 సేవలు వినియోగించాలన్నారు. అమ్మ ఒడి వాహనాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.

అనారోగ్యంతో చితికిపోయిన సింధు కుటుంబానికి ఆర్థికంగా చేయూత…

మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన యాదయ్య కూతురు సింధు గత కొన్ని నెలల కిందట ఆరోగ్యం బాగలేకపోవడంతో రూ.30 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించారు. అయితే ఆ కుటుంబానికి గ్రామ పెద్దలు, స్నేహితులు అండగా నిలిచి ఆర్థికంగా సహాయం చేశారు. ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కలిసి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మండల అధ్యక్షులు దేవరంపల్లి మహేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మనోజ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలుగుల బాలరాజు వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సహాయం చేశారు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే వారి ఆర్థిక పరిస్థితి చూసి చలించిపోయి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.3 లక్షలను మంజూరు చేయించారు. సింధు కుటుంబ సభ్యులు తమ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.3 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే యాదయ్య కు, ఆర్థిక సహాయం చేసిన నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement