Sunday, April 28, 2024

Fire Accident – ఈడెన్ గార్డెన్స్ స్టేడియం డ్రెస్సింగ్ రూంలో అగ్నిప్ర‌మాదం ….

కోల్ క‌తా – ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ -2023 కి ఇండియా ఆతిధ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. భారత్‌లో మొత్తం పది మైదానాల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ కూడా ఉంది. ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని వరల్డ్ కప్ మ్యాచ్‌లకోసం సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ 15 నాటికి మరమ్మతు పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో రెయింబవళ్లు ఈ మైదానంలో పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మరమ్మతు పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి డ్రెస్సింగ్ రూంలో మంటలు చెలరేగడంతో వీటిని గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లు ఘటన స్థలంకు వచ్చి మంటలు ఆర్పివేశాయి.

డ్రెస్సింగ్ రూమ్‌లోని సీలీంగ్‌లో ఈ మంటలు వ్యాపించాయి. విద్యుత్ పరికరాల్లో సమస్య కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై అక్కడి నుంచి బయటకొచ్చారు

అగ్నిమాపక విషయం తెలిసిన వెంటనే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ జాయింట్ సెక్రటరీ దేబ్రత్ దాస్ మైదానానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ఆటగాళ్లకోసం ఇక్కడ మరోకొత్త డ్రసింగ్ రూమ్ నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతుంది. మైదానంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదానికిగల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement