Tuesday, May 21, 2024

VKP : ప్ర‌చారంలో ఎమ్మెల్యే స‌తీమ‌ణి… సబితా ఆనంద్

వికారాబాద్, నవంబర్ 2 ( ప్రభ న్యూస్): ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ శరీరం అని సబితా ఆనంద్ గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు ఎనేపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఇంటిటికి తిరిగి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ మాసన్న గారి మంజుల ముత్యంరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు అనంతరెడ్డి కృష్ణారెడ్డి, నాయకులు రాజకుమార్ తదితరులు మాట్లాడుతూ మరోసారి ఎమ్మెల్యే ఆనంద్ ను ఆశీర్వదిస్తే వికారాబాద్ నియోజకవర్గం ను రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతారని అన్నారు. ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఆనంద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నెపల్లి వాసులు భద్రప్ప గోపి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement