Wednesday, May 1, 2024

Great Honour – వాంఖడే స్టేడియంలో క్రికెట్‌ దేవుడి విగ్రహం …. మాస్టర్‌ బ్లాస్టర్‌ కు అపురూప గౌరవం

ముంబై – భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ మరో అరుదైన గౌరవం దక్కింది. సచిన్‌ టెండూల్కర్‌కు ఎంతో ఇష్టమైన, చివరి మ్యాచ్‌ ఆడిన, తన కెరీర్‌లో ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిన ముంబైలోని వాంఖడే స్టేడియంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ నిలువెత్తు విగ్రహాన్ని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతిష్టించింది.ఇప్పటికే స్టేడియంలో సచిన్ పేరిట ఉన్న స్టాండ్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ కొడుతున్న పోజులో ఈ విగ్రహాన్ని రూపొందించారు

. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత శిల్పి ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో సచిన్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, బీసీసీఐ సెక్రటరీ జై షా, ట్రెజరర్ ఆషిష్‌ షెలార్‌లతో పాటు ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఎ) ప్రతినిధులు హాజరయ్యారు. త్వరలో శ్రీలంకతో భారత మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో సచిన్‌ విగ్రహావిష్కరణ జరగడం గమనార్హం

Advertisement

తాజా వార్తలు

Advertisement