Saturday, April 27, 2024

అంబేద్కర్‌కు ఘన నివాళి..

కుత్బుల్లాపూర్‌ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి. అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్‌, బిజెపి నాయకులు కొలను హన్మంత్‌రెడ్డి, చెరుకుపల్లి భరతసింహారెడ్డి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత కోట్లాది మంది జీవితాలలో వెలుగులు నింపిన సూర్యుడు ఏ దిక్కు లేని దిశానికి దిశను చూపిన ధీరుడు బడగుబహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అని కొనియాడారు. దేశ నవ నిర్మాణం, సామాజిక న్యాయం, బడుగు, బలహీన వర్గాలకు, మహిళలకు న్యాయమైన వాటా కోసం రచించిన వ్యూహాలపై నిర్దేశించిన విధానాలపై నిర్విహంచిన సమరశీల పోరాటాలపై చెరగని ముద్రవేసిన మహానీయుడు అంబేద్కర్‌ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement