Friday, April 26, 2024

‘పుష్ప’ రిలీజ్ డేట్ పై పుకార్లు..అసలేం జరుగుతోంది..

అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. పుష్ప ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ అయ్యింది. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇంతకముందు ఎన్నడు చేయని భిన్నమైన క్యారెక్టర్‌లో బన్నీ కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే పుష్పరాజ్‌గా అవతారమెత్తనున్నాడు. దీంతో సినిమా ఎలా ఉండబోతుందోనని ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఇటీవల విడుదలయిన టీజర్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. అల్లు అర్జున్ జోడీగా రష్మిక కనువిందు చేయనున్న ఈ సినిమాలో, ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇతనికి తెలుగులో ఇదే తొలి సినిమా.

13వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఆగస్టు నుంచి ఈ సినిమా డిసెంబర్ కి వాయిదాపడే అవకాశాలు ఉన్నాయనే ఒక రూమర్ హల్ చల్ చేస్తోంది. కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోతూ .. మళ్లీ మొదలవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ ను డిసెంబర్ కి వాయిదా వేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడేవరకూ రిలీజ్ గురించిన ఆలోచన చేయకపోవడం మంచిదనుకున్నారా? ఏది పుకారు? .. ఏది ఖరారు? అనేది సుకుమార్ క్లారిటీ ఇస్తేనేగానీ ఈ ప్రచారానికి తెరపడేలా లేదు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement