Monday, May 20, 2024

TS | ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు : కేసీఆర్‌

ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈద్‌ ఉల్‌ ఫితర్‌ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు జరిగిన రంజాన్‌ ఉపవాస దీక్షలు, పేదలకు సంతర్పన కార్యాలు, తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయని అన్నారు.

తమ పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, సర్వమతాల సమాహారంగా, గంగా జమునా తెహజీబ్‌కు ఆలవాలంగా నెలకొల్పామని కేసీఆర్‌ అన్నారు. లౌకికవాద సాంప్రదాయాలను పాటిస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టామని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement