Sunday, May 19, 2024

RR vs GT | ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం.. రాజస్థాన్‌కు తొలి ఓటమి..

జైపూర్‌లోని మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. 197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాజస్థాన్‌పై విజయం సాధించింది. గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ శుభారంభం ఇచ్చారు. సుదర్శన్ (35) అవుటయ్యాడు. గిల్ హాఫ్ సెంచరీ (72)తో చెలరేగాడు. దీంతో గుజరాత్ ఏడు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి… ఈ సీజ‌న్ లో ఓట‌మెరుగ‌ని రాజ‌స్తాన్ పై 3 వికెట్ల‌తో విజ‌యం సాధించింది.

అంతకుముందు రియాన్ పరాగ్ (76, 48 బంతుల్లో), సంజూ శాంసన్ (68 నాటౌట్, 38 బంతుల్లో) చెలరేగడంతో రాజస్థాన్ 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement