Monday, April 29, 2024

Warangal సహా ఉద్యోగి వేధింపులు – టీచర్ ఆత్మహత్యా యత్నం

వరంగల్ జిల్లా బుధరావుపేట గ్రామంలోని మోడల్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్న మహిళ ఈరోజు ఉదయం విధులకు హాజరైన తర్వాత ఆల్ అవుట్ లిక్విడ్ ఆత్మహత్యకు యత్నించింది .

ఇది గమనించిన తోటి ఉపాధ్యాయులు వెంటనే హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడనుండి మెరుగైన చికిత్స నిమిత్తం వారు ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. బాధితురాలు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు

కాగా, ఇదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు దామెర రాజేందర్ నిత్యం నన్ను మానసికంగా వేధిస్తున్నాడు అని మనస్థాపం చెంది ఆల్ అవుట్ లిక్విడ్ తాగాను అని బాధితురాలు వెల్లడించింది ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు , స్థానిక ఎంపీటీసీ సుభాన్ బీ మౌలానా , బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు హారిక పరామర్శించి మనో ధైర్యం కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement