Tuesday, December 5, 2023

తెలంగాణకు మ‌రో మూడు రోజుల పాటు వ‌ర్షాలు..

హైద‌రాబాద్ – రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు తెలంగాణకు భారీ వడగళ్ల వాన ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఉత్తర దిశ నుంచి తెలంగాణ మధ్య ప్రాంతం వరకు వడగళ్లు భారీగా కురిసే ప్రమాదముందని హెచ్చరించింది. వచ్చే అయిదు రోజులు పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. ద్రోణి మద్య ప్రదేశ్‌ మీదుగా తెలంగాణ వరకు వ్యాపించి ఉందని, దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement