Saturday, May 4, 2024

Promise – ఒకేషనల్ కళాశాల భవన నిర్మాణం పూర్తి చేసే బాధ్యత నాది – ఎమ్మెల్యే యెన్నం

మహబూబ్ నగర్,జనవరి 5 (ప్రభ న్యూస్):అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల భవనాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అవసరమైన విధంగా అన్ని సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మా పై ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  అన్నారు.శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే లు యెన్నం, జిఎంఆర్ పాల్గొని మాట్లాడారు.

త్వరలోనే ఒకేషనల్ కోర్సులలో ఇంకా కొత్తగా కోర్సులను కలిపి  తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా అద్భుతమైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా అప్ గ్రేడ్ చేసి, నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశం మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులకు అందుబాటులో తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.  అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  కళాశాలలో తాగునీటి ఎద్దడి ఉందని, బేంచీలు సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఎమ్మెల్యే యెన్నం దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన ఎమ్మెల్యే  వెంటనే రెండు రోజుల్లో సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.

బిసి సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న  విద్యార్థులు భోజనం బాగుండదని  ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఒకటి రెండు రోజుల్లో హాస్టల్ కు వచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థులు గొప్పగా చదువుకొని మహబూబ్ నగర్ కు పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆయన విద్యార్థులకు సూచించారు.ఆతరువాత  ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజి సిబ్బంది ఘనంగా ఎమ్మెల్యే లను సన్మానించారు.

 ఈ కార్యక్రమంలో  DIEO వెంకటేశ్వర్లు,ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి. గోపాల్,బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంత చారి, లెక్చరర్స్ నర్సింహరెడ్డి, నండూరి శ్రీనివాస్, హర్షవర్ధన్ రెడ్డి, సిరాజ్ ఖాద్రీ , రాజేందర్ రెడ్డి, శేఖర్ నాయక్, లక్ష్మణ్ యాదవ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement