Tuesday, November 28, 2023

MDK: తూప్రాన్ పర్యటనకు ప్రధాని మోడీ… ఏర్పాట్లను పరిశీలించిన నేతలు

తూప్రాన్ : భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ లో సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ క్రమంలో భాగంగా తూప్రాన్ లోని హైదర్ గూడలో టాటా కాఫీ కంపెనీకి దగ్గరగా ఉన్న ఖాళీ స్థలంలో విస్తృత ఏర్పాట్లకు స్థల పరిశీలన జరుగుతున్నది. మోడీ పర్యటన ఈనెల 25వ తేదీన ఉండే అవకాశం ఉంది. ఇందిరాగాంధీ తర్వాత తూప్రాన్ కి భారతదేశ ప్రధానమంత్రి రావడం ఇదే తొలిసారి.

- Advertisement -
   

తూప్రాన్ రాజేంద్రుడి, నరేంద్రుడి అపూర్వ కలయికకు, అపూర్వ విజయానికి వేదిక కానున్నదని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మల్లారెడ్డి, మెదక్ పార్లమెంటరీ కన్వీనర్ వర్గంటి రామ్మోహన్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సంఖ్య యాదగిరి, మున్సిపల్ శాఖ అధ్యక్షులు మహేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా నేతలు స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement