Monday, April 29, 2024

BRS Election Campaign – కాంగ్రెస్ తెచ్చేది.. భూమాతా? భూమేతా? – కేసీఆర్

మాన‌కొండూరు – కాంగ్రెస్ తెచ్చేది, భూమాతానా ? భూమేతానా? కాంగ్రెస్ చరిత్రే బొక్కుడు చరిత్ర , మళ్లీ రాష్ట్రానికి నాశనం చేస్తారు అని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్, బీజేపీపై విరుకుపడ్డారు. ఈ సభలో మానకొండూర్ ప్రజలు తండోపతండాలుగా పోటెత్తారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లడుతూ, ఇందిరమ్మ రాజ్యమంటే ఏందీ? కరెంటు కోసం గోస పెట్టాం, బోర్లు వేయటానికి అల్లాడిపోయాం, మోటార్లు కాలిపోయేవి, కరెంటు ఎప్పుడొస్తాదో? తెలీదు. అర్ధరాత్రి లేదు. అపరాత్రి లేదు. పొలాల్లో పండేవాళ్లం, ఇదీ కాంగ్రెస్ రాజ్యం గతి, అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదేళ్ల కాలంలో కరెంటు కష్టాలు లేవు. 24 గంటలు మంచి కరెంటును ఇస్తున్నాం, మోటార్లు కాలటం లేదు. కాంగ్రెస్ నాయకులకు మూడు గంటల కరెంటు సరిపోద్దట, నీళ్లు పారలంటే 10 హెచ్పీ మోటర్ పెట్టుకోవాలి, రాష్ర్టంలో 30 లక్షల మోటార్లు ఉన్నాయి, వీటిని మార్చటానికి డబ్బులు ఎవరు ఇస్తారు? వాళ్ల అయ్య ఇస్తాడా? అని కేసీఆర్ ప్రశ్నించారు.


సంక్షేమం, వ్యవసాయం స్థిరీకరణకు కృషి చేస్తున్నాం, పేదలకు రూ.1000 పెన్షన్ ఇచ్చాం, రూ,2000లకు పెంచాం, ఇక నుంచి రూ.5000లు ఇస్తాం అని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆటో డ్రైడర్లకు పన్నులు రద్దు చేశాం, ఇక ఫిట్నెస్ కోసం రూ.1200లు ఖర్చు. ఈ భారాన్ని తగ్గిస్తాం. ఈ ఎన్నికలు గెలవగానే ఆటోలకు ఫిట్నెస్ చార్జీలు రద్దు చేస్తామని కొత్త పథకాన్ని కేసీఆర్ ప్రకటించారు. ఇక బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లడుగుతోందని కేసీఆర్ ప్రశ్నించారు. కరెంటు వాడే బోర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని మోడీ పదే పదే వత్తిడి చేస్తే.. ప్రాణం పోయినా మీటర్లు పెట్టనని ఎదురు తిరిగా. కేంద్రం కేటాయింపుల్లో సంవత్సరానికి రూ.5వేలు కట్ చేస్తానని హెచ్చరించి.. ఐదేళ్లల్లో తెలంగాణకు రావాల్సిన రూ.25వేల కోట్లు ఇవ్వలేదన్నారు.

అంతే కాదు దేశంలో అన్ని రాష్ర్టాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చి తెలంగాణకు ఇవ్వలేదని, పార్లమెంటు చట్టం ప్రకారం ప్రతి జిల్లాలకు నవోదయ స్కూలును మంజూరు చేయాలని, కానీ చట్టాన్ని ఉల్లంఘించి ఒక్కటంటే ఒక్క నవోదయ స్కూలును ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని కేసీఆర్ ప్రశ్నించారు. అందుకే చెప్పడు మాటలు వినొద్దు, ఆగమాగంగా, అడవి పాలు కాకుండా బీఆర్ఎస్కే ఓటు వేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

హుజురాబాద్ తరహాలో దళిత బంధు పథకాన్ని తానే అమలు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. దేశంలో దళితులు ఇంకా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వివక్ష పోలేదు. అందుకే దేశంలోనే తొలిసారిగా దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చనని కేసీఆర్ వివరించారు. బాలకిషన్ మళ్లీ గెలుస్తాడు. ఇందులో అనుమానం వద్దు, మూడో సర్వే కూడా చేయించాం. ఈ సర్వేలోనూ బీఆర్ఎస్కే గెలుస్తుందని నివేదిక వచ్చింది. తెలంగాణాలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. మెజారిటీ తగ్గొద్దు అని కేసీఆర్ అన్నారు.

స్టేష‌న్ ఘ‌న్పూర్ , న‌కిరేక‌ల్ స‌భ‌ల‌లో కెసిఆర్ మాట్లాడుతూ, “తెలంగాణ‌లో వ‌డ్లు ఎలా పండుతున్నాయో ఇండ్ల నిర్మాణం కూడా అట్ల‌నే జ‌రుగుత‌ది వ‌చ్చే ఐదేండ్లు. మ‌నం ఏదైనా ప‌డితే గ‌ట్టిగ ప‌డుతం క‌దా.. ఇండ్ల జాగాలు లేనోళ్ల‌కు జాగాలు ఇస్తాం.. సొంత జాగ ఉన్నోళ్ల‌కు డ‌బ్బులు ఇస్తాం.. ఇల్లు లేని మ‌నిషి లేకుండా చేసుకుందాం. ఒక‌టి త‌ర్వాత ఒక‌టి చేసుకుంటూ వెళ్దాం” .. అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement