Thursday, September 21, 2023

NLG: రికార్డు స్థాయిలో కందుల, పెసర్లకు ధరలు

తిరుమలగిరి, సెప్టెంబర్ 15, ప్రభ న్యూస్ : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలోని వ్యవసాయ మార్కెట్ కు శుక్రవారం పెసర్లు 201 బస్తాలు, ఆరు బస్తాల కందులు వచ్చినాయి. పెసర్లకు కింటా గరిష్ట ధర రూ.9,276లు, కనిష్ట ధర రూ.7909లు, మధ్య రకం ధర రూ.8959 పలికింది.

- Advertisement -
   

కందులకు క్వింటా గరిష్ట ధర రూ.9929లు, కనిష్ట ధర రూ.8609లు, మధ్య రకం ధర రూ.9879 పలికింది. వ్యవసాయ మార్కెట్ కు 60 మంది రైతులు సరుకులను తీసుకువచ్చినారు. ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో కందులకు, పెసలకు ధరలు రావడం ఇదే ప్రథమం. రైతులు నాణ్యత ప్రమాణాలతో సరుకులను మార్కెట్ కు తీసుకువచ్చి మద్దతు ధరలు పొందాలని మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ సూపర్ వైజర్లు అల్తాఫ్ అలీ అస్మాలు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement