Friday, September 22, 2023

గ్రేటర్ నోయిడాలో లిఫ్ట్ కూలి నలుగురు మృతి

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో ఇవాళ విషాద ఘటన జరిగింది. ఓ బహుళ అంతస్థుల భవనంలో లిఫ్ట్ కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఆమ్రపాలి డ్రీమ్ వ్యాలీ హౌసింగ్ సొసైటీ ఓ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపడుతోంది. లిఫ్ట్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా అది కుప్పకూలింది. ఈ ఘటనలో లిఫ్ట్ కిందే ఉన్న నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

- Advertisement -
   

జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ శర్మ మాట్లాడుతూ.. “ప్రమాదంలో నలుగురు మరణించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారు నగర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నాం” అని అన్నారు. ఘటనకు కారణమైన బిల్డర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement