Sunday, May 19, 2024

ప్రకాష్ అంబేద్కర్ కు ఘన స్వాగతం

హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ గురువారం హైదరాబాద్ కు వచ్చారు. నగరానికి వచ్చిన ప్రకాష్ అంబేద్కర్ కు రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.రేపు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకాష్ పాల్గొననున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement