Monday, May 6, 2024

Poster War – రాహుల్ గాంధీ ని ప్రశ్నిస్తూ పోస్టర్స్ .. తెలంగాణకు ఏం చేశారంటూ నిలదీత ….

ములుగు . కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో మూడు రోజులు పర్యటించనున్నారు.. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నేడు సోద‌రి ప్రియాంకా గాంధీతో క‌ల‌సి ప్రత్యేక విమానంలో హైద‌రాబాద్ కు చేరుకుని, అక్క‌డి నుంచి రామ‌ప్ప దేవాలయానికి వెళ్లారు.. తెలంగాణ‌కు ఆయ‌న రాక‌ను పుర‌స్క‌రించుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల‌లో ఆయ‌న‌ను ప్ర‌శ్నిస్తూ వాల్ పోస్ట‌ర్లు ద‌ర్శ‌న‌మించాయి..లోక్ స‌భ‌లో మీరు ఏ నాడైనా మేడారం జాత‌ర‌కు జాతీయ హోదా ఇవ్వాల‌ని కోరారా రాహుల్ జీ అంటూ సూటిగానే ప్ర‌శ్నించారు..

ట్రైబ‌ల్ వ‌ర్శిటిని నోరు మెద‌ప‌రేంటూ అంటూ నిల‌దీశారు.. రామ‌ప్ప దేవాల‌య అభివృద్ధికి నిధుల కోసం లోక‌స‌భ‌లో ఏనాడైన ప్ర‌స్తావించారా అంటూ ప్ర‌శ్నించారు.. ఇవేమీ చేయ‌కుండా తెలంగాణ‌లో ఓట్లు ఆడిగేందుకు మాత్రం వ‌చ్చారంటూ పోస్ట‌ర్ లో రాహుల్ ను దులిపేశారు.. తెలంగాణ‌కు ఒక్క ఉప‌యోగ ప‌డే చేయ‌ని ఇటువంటి ఓట్ల వేష‌గాళ్లు మ‌న‌కు అవ‌స‌ర‌మా అంటూ పోస్ట‌ర్ లో ప్ర‌స్తావించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement