Friday, May 17, 2024

రానున్నది బిజెపి ప్రభుత్వమే : పొంగులేటి సుధాకర్ రెడ్డి

బోనకల్, ఏప్రిల్ 26, (ప్రభ న్యూస్) మండల ఫరిదిలోని రావినూతల గ్రామంలో బుధవారం బీజేపీ పార్టీ ఖమ్మం పార్లమెంట్ ప్రవాస యోజన ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశం బీజేపి జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ అధ్యక్షతన ఆయన ఇంటి వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా జాతీయ నాయకులు తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి రాంమోహనరావు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ ఇన్చార్జ్ దేవకి వాసుదేవరావు హాజరయ్యారు. ముందుగా స్థానిక
సాయిబాబా, కనకదుర్గ మాత ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో రాబోయేది బిజేపి ప్రభుత్వమేనని, పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్య్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యల పై పెద్ద ఎత్తున పోరాటం చెయ్యాలని సూచించారు.

నష్టపోయిన రైతును ఆదుకోవాలి : పొంగులేటి సుధాకర్ రెడ్డి

మంగళవారం కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిన మొక్కజొన్న కళ్లాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తడిసిన మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన దళారుల చేతుల్లో రైతులు చితికి పోతున్నారన్నారు. గత నెల మండల పర్యటనలో సీఎం కేసీఆర్ నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. వాస్తవిక సాగు రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల నాయకులు, జిల్లా అధికార ప్రతినిధులు, జిల్లా అసెంబ్లీ కన్వీనర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement