Friday, May 3, 2024

ప్రభుత్వ ఫలాలు ప్రజలకు తెలియ జెప్పాలి… బోధన్ ఎమ్మేల్యే షకీల్

నిజాంబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. ప్లీనరీ సమావేశానికి ముఖ్యఅతిథిగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ హాజరయ్యారు. ప్రభుత్వ ఫలాలు నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో ఇంటింటా ప్రజలకు తెలియ జెప్పాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బుధవారం ఎడపల్లి మండలంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో జరిగింది . ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతు రాబోయే రోజుల్లో ఆత్మీయ సమావేశాలు ఉంటాయని, తెలంగాణ తో పాటు పక్క మహారాష్ట్ర లో పార్టీ ఉనికి చాటేందుకు కేసీఆర్ తనను పంపారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గల్లి గల్లికి ప్రచారం చేయాలని,పార్టీ క్రమశిక్షణ కు మారు పేరని తెలియ జేస్తు ,జై తెలంగాణ నినాదాలతో కార్యకర్తలలో ఆత్మస్థైర్యం నింపారు. ఆకాల వర్షంకు నష్ట పోయిన రైతుల ప్రతి గింజ తప్పక కోనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా యూనివర్సిటీ లను ప్రతి పక్షాలు ఏర్పాటు చేసుకుని అసత్య ప్రచారాలు చేస్తున్న వాటి ఊబిలో ప్రజలు పడవద్దని సూచించారు. అంతకుముందు కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించి , జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే డిసిసిబి డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి నాటి టిఆర్ఎస్ నేటి బిఆర్ఎస్ చారిత్రాత్మక పార్టీ అని , కార్యకర్తలు పార్టీ కి పునాది అని సామాజిక పురోగతి పై తీర్మానం ప్రవేశపెట్టారు. వీఆర్ దేశాయి తీర్మానాన్ని ఆమోదించారు. జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు మాట్లాడుతూ తక్కువ వ్యవధిలో ఎమ్మెల్యే షకీల్ పిలుపుమేరకు సమావేశం విజయవంతం చేసిన కృతజ్ఞతలు తెలియజేస్తూ తడిసిన రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామన్న తీర్మానం రాష్ట్రానికి పంపుతామన్నారు.

ప్లీనరీలో ప్రవేశ పెట్టిన 8 తీర్మాణాలు ఇవే
బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 8 అంశాలపై పలువురు పార్టీ నేతలు ప్రవేశాలు, ఆమోదాలు తెలిపారు. అందులో , మహిళల అభివృద్ధి పై జడ్పీ వైస్ చైర్మన్ , రైతు సంక్షేమం పై బుద్దె రాజేశ్వర్, బిసి సంక్షేమ పథకాలపై ఆకుల శ్రీనివాస్, దళిత బంధు పై తెడ్డు పోశేట్టి, పల్లె,పట్టణ ప్రగతి పై సంజీవ్ రెడ్డి, ఎటిఎస్ శ్రీనివాస్ లు , మైనారిటీ సంక్షేమ పై మాజీ కౌన్సిలర్ అత్తావుల్లా ,గురుకుల పాఠశాల లు, ఫించన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్, ఇలా 8 సంక్షేమ పథకాలపై తీర్మాణాలను ప్రవేశ పెట్టి ఆమోదించారు.

అనంతరం జానపద గాయకుడు అష్ట గంగాధర్ కళాబృందం పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. సమావేశం అనంతరం
ఎమ్మెల్యే సాముహికంగా కలిసి పార్టీ శ్రేణులతో భోజనం చేశారు.
ఈ ప్లీనరీ సమావేశంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, ఉపాధ్యక్షురాలు రజిత, కోటపాటి నర్సింహ నాయుడు, ఎఎంసి చైర్మన్ వేంకటేశ్వర రావు దేశాయి, ఎటిఎస్ శ్రీనివాస్,ఎంపిపి లు బుద్దె సావిత్రి, జడ్పీటిసి లు గిర్దావర్ లక్ష్మి, నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు దేరడి శ్రీరాం, సంజీవ్,భూంరెడ్డి, ఎడపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆత్మేల శ్రీనివాస్ ముదిరాజ్, కౌన్సిలర్లు, పిఏసీఎస్ సోసైటి ల చైర్మన్ లు, సర్పంచులు, ఎంపిటిసి లు, గ్రామ పార్టీల అధ్యక్షులు, బోధన్ నియోజకవర్గంలోని అన్ని మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement