Sunday, January 23, 2022

11 మంది పీఎస్ఐలకు పోస్టింగ్స్… ఆర్డర్స్ ఇష్యూ చేసిన పోలీస్ బాస్

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ప్రోబిషనరీ సబ్ ఇన్ స్పెక్టర్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న మరో 11 మందికి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 62 మంది పీఎస్ఐలలో గురువారం 42 మందిని పోలీస్ స్టేషన్లకు అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ బాస్, శుక్రవారం మరో 11 మందికి పోస్టింగ్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇంకా 9 మంది పీఎస్ఐలు పోస్టింగ్స్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. శుక్రవారం రాత్రి నలుగురు పీఎస్ఐలను ఖాళీగా ఉన్న టాస్క్ ఫోర్స్ టీం లో నియమిస్తూ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ఆదేశాలు జారీచేశారు. మరో నలుగురిని పీసీఆర్ లో, ఒకరిని సీసీఎస్, మరొకరిని సైబర్ క్రైమ్ కు, ఇంకొక‌రిని సీ ఎస్ బి లలో నియమిస్తూ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ఆర్డర్స్ ఇష్యూ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News