Sunday, January 23, 2022

Breaking : మోడీని వంగ‌బెట్టి నాలుగు గుద్ద‌యినా గిట్టుబాటు ధ‌ర సాధిస్తాం .. రేవంత్ రెడ్డి..

బీజేపీ, టీఆర్ ఎస్ తోడు దొంగ‌ల‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గుండు, అర‌గుండు మ‌న‌కు పంగ‌నామాలు పెడుతున్నార‌ని అన్నారు. కాంగ్రెస్ ను తాగుబోతు సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించడం విడ్డూర‌మ‌ని తెలిపారు. తెలంగాణ రైతుల‌ను ఉరి వేస్తున్నార‌న్నారు. గిట్టుబాటు ధ‌ర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోండి అన్నారు. 9గంట‌లు ఉచిత విద్యుత్ ఇచ్చి రైతుల‌ను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. విత్త‌నాలు,ఎరువుల ధ‌ర‌లు పెర‌గ‌కుండా చూసిందే కాంగ్రెస్ అని స్ప‌ష్టం చేశారు. చౌక‌ధ‌ర దుకాణాలు పెట్టిందే కాంగ్రెస్ అన్నారు. పార్ల‌మెంట్ లో న‌రేంద్ర మోడీ చొక్కా ప‌ట్టి, వంగ‌బెట్టి నాలుగు గుద్ద‌యినా గిట్టుబాటు ధ‌ర‌ని సాధిస్తామ‌ని చెప్పారు. మేం అంద‌రం ఈ ధ‌ర్నా చౌక్ లో నిద్రిస్తామ‌న్నారు. కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో మౌన‌దీక్ష ని ఇందిరాపార్కు వ‌ద్ద చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News