Sunday, April 28, 2024

వీడు మామూలోడు కాదు… ట్యూబ్ వీడియోలు చూసి..

ట్రాఫిక్ ఈ చలాన్‌లను మీ సేవ నిర్వాహకుడి ఖాతా నుండి కట్టిన జగన్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిరోజుల క్రితం తన చలాన్‌లను కట్టేందుకు  జగన్ మీ సేవ కేంద్రానికి వెళ్లాడు. ఈ క్రమంలో మీ సేవ నిర్వాహకుడి యూజర్ ఐడీ పాస్‌వర్డ్ గమనించాడు. అనంతరం యూ ట్యూబ్ వీడియోలలో మీ సేవ పని తీరు చూసి నేర్చుకున్న జగన్..ఆపై మీ సేవ నిర్వాహకుడి ఖాతా నుండి తనకు తెలిసిన వారి ఈ చలానాలు కడుతా అని వారి నుండి డబ్బు వసూలు చేశాడు. విషయం తెలుసుకున్న  మీ సేవ నిర్వాహకుడు పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక పరిజ్ఞానంతో వరంగల్‌కు చెందిన జగన్‌ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement